బంగారు తంగేడు


Sun,October 14, 2018 10:56 PM

Cassia-auriculata
బంగారు తంగేడు మురిసింది
గౌరమ్మ జడలోన మెరిసింది ॥బంగారు॥
అందాల బతుకమ్మ మేనిపై
తానిపుడు పచ్చని చీరగా.. పరవశిస్తోంది
అంబరానికెగసే సంబరం తనదని
అన్నదమ్ముళ్ళను ఆశీర్వదించను
పసిమి ఛాయతోటి పసిబాలతానయ్యింది
బంగారు తంగేడు మురిసింది
గౌరమ్మ జడలోన మెరిసింది
తెలంగాణమంతా వాడవాడలా తనను బొట్టెట్టి పిలుస్తుంటే
ఆనందముప్పొంగ హాయిగ నవ్వింది
పుట్టింటి పడుచులా పొందిగ్గా వెళ్ళింది
పల్లె ముంగిళ్ళను ప్రేమగా తడిమింది
అక్కచెళ్ళళ్ళ తోటి ముచ్చట్లు ఆడింది బంగారు తంగేడు మురిసింది
గౌరమ్మ జడలోన మెరిసింది,
- శాంతికృష్ణ, 95022 36670

394
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles