పెకిలిన ‘మీటూ’ గళాలు


Sun,October 14, 2018 10:55 PM

news_focus_rape
కోమలి కళ్ళల్లో ఇంకిన కన్నీళ్ళ ఊటలు
అవకాశాల ఎరతో అశ్లీల అరాచకాలు
ఒళ్లంతా తేళ్లు జెర్రులు పాకినట్టు
గుచ్చి గుచ్చి కామాంధుల చూపులు
కరచలనంలోనూ కామ స్పర్శ ముళ్లు
మాటలే అసహ్య తూటాలు
చేతల్లో చిత్రవథల చితిమంటలు
నీడలా వెంటాడే నీచ నికృష్ట చేష్టలు
శృతిమించిన సుఖవాంఛల సునామీలు
మౌనవ్రత భంగం వీడిన మహిళలు
క్యాస్టింగ్ కౌచ్ మరకలు కడగకముందే
పిట్టగూట్లో పెకిలిన మీ టూ గళాలు
ఆరోపణల సుడిగుండంలో అన్నిరంగాలు
ధారాళంగా పారిన స్త్రీ ధైర్యపు వరదలు
దేవీ నవరాత్రుల సాక్షిగా
దుర్గమ్మ శూలమే విస్ఫోటనం కావాలే
రాంలీలాలో రావణ వథ జరగాలే
మృగాళ్ళ మదాన్ని కామదహనం చేస్తూ
ఆడబిడ్డ బతుక్కు బతుకమ్మ భరోసా ఇవ్వాలే!
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి, 99497 00037

522
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles