ప్రపంచ కవిత


Mon,October 8, 2018 01:46 AM

-డెనిస్ లెవెర్ తొవ్
-(1923, అక్టోబర్ 24-1997, డిసెంబర్ 20)

DENISE-LEVERTOV
మొదటి ప్రపంచ యుద్ధంపై నిరసన స్వరాన్ని వినిపించిన ఓ యూదు అధ్యాపక మేధావి కూతురిగా, బాల్యంలోనే జర్మన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలను నేర్చుకున్న విద్యార్థిగానూ విస్తృత ఆలోచనాపరిధిని సాధించిన ఆధునిక కవయిత్రి ప్రిసిలా డేనిష్ లెవెర్‌తొవ్! తొలినాళ్లలో నర్స్‌గా పనిచేసిన ఆమె, తన 23వ ఏట తొలి కవితా సంకలనం Doble Image (1946)ను ప్రచురించింది. అమెరికాలో స్థిరపడినాక ఆధునికానంతర కవిత్వోద్యమమైన Black Mountains Poets (1933-56) చేత ప్రభావితమైంది. ప్రఖ్యాత The Nation పత్రికకు సాహిత్య సంపాదకురాలిగా స్త్రీవాద అంశాలకు, వామపక్ష భావాలకు విస్తృత వ్యాప్తి కలిగించింది. మతపరమైన వస్తువుల్లోంచి సైతం అత్యాధునిక కవిత్వాన్ని మానవీయకోణంలో ఆవిష్కరించిన ఆమె రచనల్లో Here and Now (1956), With Eyes at the Back of Our Head (1959), The Sorrow Dance (196 7), Obileque Prayers (1984), Evening Train (1994) వంటివి ముఖ్యమైనవి.

పడమటి పథం!

నువ్వు చూస్తున్న పచ్చదనమంతా
నాలోనే ఉంది
చిక్కనౌతూ... గాఢమౌతూ... Muscadine*లా!
నువ్వన్నట్లు స్త్రీ కనక చంచలే అయితే
మంచిదే,
ఆ ఉత్తాన పతనాలకే నేను దాసోహమౌతాను
ఋతువులకు అనుగుణంగా చలించేవాన్ని కదా
పండ్లు విరగకాసే ఈ కాలంలో...!
ఒకవేళ ఆమె ప్రమేయమే నిజమైతే
ఓ ధృవ నక్షత్రం, శుభం సూచిస్తుంది
నల్లని ఆకాశంలో నేను నిశ్చలున్నై
ఉదయపు వెలుగులో అంతర్ధానమౌతాను
సౌరజ్వాలలో మాడిపోయి మసినౌతాను
పొరల పొరల మబ్బుల దుప్పటిఎగువన సమసిపోతాను
అక్కడ ఏ రుచీ ఉండదు
ఆనందం లిప్తకాలం
అతి తీయందనం -- అతి ఉప్పదనమే విస్తారం!
ఏమంటున్నావ్, స్త్రీ మూర్తీ
ఎవరితో, నాలో లోలోపలి నాతోనేనా?
సూర్య చలనాను గుణంగా
పొడవుగా పెరిగే నీడను
నేను, కేవల ఆశ్రితుణ్ని!
విస్మయ తంత్రి నుంచి ఉద్భవించినవాణ్ని!!
బాధ్యతల బరువును మోయగలిగిన వాణ్ణే అయితే
వాళ్ళందరూ నన్ను గుర్తుంచుకోవడం మొదలెట్టేవారు
కానుకలుగా, వస్తువులుగా, రొట్టెల గంపగా...
నా భుజాలను అభిమాన భారంతో గాయపరిచే వారు
కానీ, సుగంధ పరిమళాలతోనే నన్ను ముంచెత్తారు
అయితేనేం, నేనిక దీన్ని ఆస్వాదిస్తాను
ఇలానే గమిస్తూ.. చరిస్తూ.. ప్రయాణిస్తూ.. ప్రవహిస్తూ..!
(* అమెరికా దక్షిణాది రాష్ర్టాలలో పెరిగే ఓ రకం ద్రాక్ష)
-మూలం: డెనిస్ లెవెర్‌తొవ్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231


నందగిరి ఇందిరా దేవి కథలు ఆవిష్కరణ

నందగిరి ఇందిరాదేవి కథలు ఆవిష్కరణ సభ 2018 అక్టోబర్ 8న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతుంది. ఈ సభలో డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, ఆచార్య వడ్లకొండ స్వరాజ్యలక్ష్మి, నందగిరి వీర, డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి, డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొంటారు.
- డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ, కార్యదర్శి

డాక్టర్ వేదగిరి రాంబాబు సాహిత్య పురస్కారాలు

2018 సంవత్సరానికి డాక్టర్ వేదగిరి రాంబాబు సాహిత్య పురస్కారాలు ప్రకటించారు. ఈ ఏడాదికి బాలసాహిత్య పురస్కారం-డాక్టర్ పత్తిపాక మోహన్‌కు, కథానిక పురస్కారం-డాక్టర్ జడా సుబ్బారావుకు ప్రకటించారు.ఈ పురస్కారాలు అక్టోబర్ 14న రవీంద్రభారతిలో ఉదయం 10.30 గంటలకు అందజేస్తారు.
- సింహప్రసాద్, సాహిత్య సమితి

1206
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles