రైతు!


Mon,October 8, 2018 01:42 AM

Raithu
జాతికి అన్నం పెడ్తవు
నీతికి పట్టం కడ్తవు
గిట్టుబాటు ధర లేక
బొక్క బోర్ల నువు పడ్తవు!
రైతన్నల కడుపు మంట
పాలకులకు ఒళ్ళు మంట
ఢిల్లీకి రైతులొస్తే
శాంతికది విఘాతమంట!
పంట నీది తింటారు
పండ్లు నీవి తింటారు
హక్కులను అడిగావా
నిను నంజుకు తింటారు!
ఆత్మ హత్యలొద్దంటరు
రైతులంటె ముద్దంటరు
ధరల కోసం నిలదీయగ
ఢిల్లీకి రావొద్దంటరు!!
అంబానికి మొక్కుతరు
అందినంత మెక్కుతరు
పట్టించు కోమంటే
రైతన్నల తొక్కుతరు..!
- వెన్నెల సత్యం 94400 32210
(ఢిల్లీలో రైతులపై దాడికి నిరసనగా..)

556
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles