నెనరు నెమరుకొస్తుంటే..


Mon,October 8, 2018 01:41 AM

FARMER
ఆకాశం లేనివాళ్లకి వెన్నెలెక్కడిది
అరిపాదాలకి ఆత్మకి
ఆమెడ దూరం..!
బంధాలన్ని కక్కబోసుకొని
తలుపు దగ్గరేసుకొని
ఇరుకు ఇరుకుగా
తారీకుల మీద
పాకుతున్న బల్లులు..!
గీ క్రూరకాలం రాకముందు
ఈ అడవిలో
ఆకుపచ్చ రొమ్ములపై
సీతాకోకచిలుకలు పూసేవి..
మట్టిలో బొర్లి
నీళ్ళలో తడిసి


యెదలోతుల్లో తానమాడి
అతీతమై అనంతమై
పేగుబంధాల లోకంలో..
మాటల తడిలో..
పంచుకున్న రక్తం
పరిమళించేది
గట్కో గంజో
గానమై పానమయ్యేది..!
చిన్నమ్మలు కక్కయ్యలు
అత్తలు మామలు
అక్కలు బావలు
సాలిగాడు దేవిగాడు
కంట్లో కామంచమ్మ
ఆకిట్లో వాళ్ళు వీళ్ళు
ఊరు ఉయ్యలై.. ...
నెనరు నెమరుకొచ్చింది
శ్రావణం వచ్చిందంటే..
కాలం కాళ్ళకి పసుపు పూసుకొని
బోనమెత్తెది!
గల్మ పూదిచ్చుకొని
మదిచ్చుకొనేది!
పిల్లలు జెల్లలు
గుమ్మాలకి తోరణాలు
సంబరాలనెత్తుకొని ఇల్లు
సారెలు పోసుకునేది..!
చెట్లకింది కొచ్చి
చేదుకున్న చెమ్మ
కనిపించే ప్రాణం..!
సాలెమ్మటి సాలెమ్మటి
విత్తనాలేసి
ఇంటి ఆడబిడ్డలు
పోతూ.. పోతూ..
ఆత్మల్ని అంటుగట్టిపోయేది...

535
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles