పార్ లాగర్ క్విస్ట్


Mon,October 1, 2018 01:19 AM

-(1956, సెప్టెంబర్ 24-1993, అక్టోబర్ 8 )
par-lagerkvist
దక్షిణ స్వీడన్‌లో ఓ స్టేషన్ మాస్టర్ కొడుకుగా జన్మించి ఆ తర్వాత ఫ్రాన్స్, ఇటలీలలో అత్యధిక కాలం పర్యటించిన కవి, రచయిత, నాటకక ర్త, చిత్రకారుడు పార్ ఫేబియన్ లాగర్ క్విస్ట్!
అనాది కాలం నుంచి ఏ పురాణ ప్రతీకలు, నీతి సూత్రాలు సమాజ గతిని నిర్దేశిస్తూ వచ్చాయో, అవే పురాణ గాథలను, ప్రతీకలను నిరసన ధ్వనులుగా, నవ్య ఆలోచనా ప్రేరకాలుగా కవిత్వీకరించిన ఆధునిక కవి లాగర్ క్విస్ట్!!
పుట్టి పెరిగిందంతా సంప్రదాయ క్రైస్తవ కుటుంబంలోనే అయి నా, దానికి అతీతంగా తొలినాళ్ళలో రాడికలిస్ట్ దృక్పథాన్ని. ఆ తర్వాత మానవతా ధోరణిని, సర్వ మానవ సమానత్వ స్ఫూర్తిని తన జీవితంలో-సాహిత్యంలో ఆచరించి, మతం కన్నా మానవు డు, మానవుడి కన్నా మానవాళికే తన ప్రాధాన్యం అని చాటి చెప్పి న సాహితీమూర్తి! విలువల విధ్వంసాన్ని, యుద్ధ బీభత్సాన్ని, ప్రకృ తి వినాశనాన్ని చూసి చలించిన ఆయన, మానవ వేదనను, సంవేదనలను, యాతనను, గోసను తన అక్షరాల్లో అద్దం పట్టే ప్రయ త్నం చేశారు. నిరంతరం గెలుస్తున్న మానవుడు అంతరంగంలో ప్రతీక్షణం ఓడిపోతున్న దృశ్యాన్ని, విశ్వప్రేమలో తనను తాను పునర్నిర్మించుకుంటున్న వాస్తవాన్ని తన కవిత్వంలో సాక్షాత్కరింపజేశాడు. Anuguish (1916), Songs from the Heart (1926) వంటి కావ్యాలతో ప్రసిద్ధికెక్కిన ఆయనను 1951లో ప్రతిష్ఠాత్మక నోబెల్ సాహిత్య బహుమతి వరించింది.

527
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles