రోడ్ టెర్రర్..!


Mon,October 1, 2018 01:18 AM

మూకుమ్మడిగా
చప్పట్లు చరచినట్టు..
Road-terror
ఆ వీధిలోని
రాగిచెట్టుమీది
ఆకుల వాయిద్యాలన్నీ
గలగలామోగినట్టు..
ఎవరో ఒకరు పల్కరించినట్టు
ఈ నగరంలో ఏదో ఒకమూల
కలకలం రేగినట్టు,
అంతులేని సమస్యలతో
అశాంతిగా తలలు బాదుకున్నట్టు
మనతో నడుస్తున్న జీవితమే
ఎదురుతిరిగి
దాపరికాల మొగమాటాల
ముసుగులన్నీ చింపేసి
ముఖం మీద గుద్దినట్టు
ప్రశ్నల సూదులు గుచ్చినట్టు
రోడ్డు మూలమలుపులో
అదుపు తప్పిన బస్సువేగానికి
ఏ పాపమెరుగని ముగ్గురు..
అక్కడో కొండమలుపులో
అరవైకి పైగా..
మృత్యుముఖంలోకి
అనూహ్యంగా రక్తమోడే
రహదారులవెంబడి
ఇంతకు ఎవరు సురక్షితంగా
నడచి వెడుతున్నట్టు?
- నిఖిలేశ్వర్, 9177881201

476
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles