పుంజీతం


Mon,September 24, 2018 12:51 AM

రెప్పల్లోంచి దేహం దేహమంతా
పొద్దుపువ్వు పరిమళం.. వర్తమానం
చీకటి వర్షం మోసిన నేల కళ్లల్లో
వెలుగు పూల వినూత్న కాంతి.
ఎడారి దిగులు కమ్మిన వాకిట్లో
నిత్య వసంత సమీర సందర్భం.
ఇప్పుడు అనుభవాల నిండా
ప్రతిఫలనాల జీవన లయ.
పలుకునోచని గొంతుకలకు
ఇంటిపదాల పరిష్వంగ రాగయోగం.
నడక నేర్చిన నది బీళ్ల గుండెల ప్రాణహిత.
కళ్లు పొదుగుకున్న కలల విత్తనాల నారు
చుట్టూ గొలుసుకట్టు ద్రవసంకల్పం
కడివెడు కన్నీళ్ల దీక్ష
కడపలో నిండిన కుండ
గిట్టుబాటుకందని నాగలి ఆర్తికి
భరోసానీడ.
పొట్టకొచ్చిన చేనుకు కల్లం కళ
విశ్వాసం రైతు చిరునామా.
పుట్టువడి సార్థకమౌతున్న పెట్టువడి.
వివేకం నిరూపించుకోవలసిన ఆచరణ.
వికాసం చేరాల్సిన గమ్యం.
అవివేకాల గడియ వేసుకున్న
రెప్పల కావలి నిజాల హోరు.
మరిగిన చీకటి సావాసం కోసం
మరోసారి మోహరించిన తోడేళ్ళ చూపు.
కలిసివచ్చే కాలానికి కాళ్లు గుంజే కుట్ర.
ఇది ఎత్తుల జిత్తుల పుంజీతం .
పులి నుంచి
మేకలను కాపాడుకోవాల్సిన యింగితం.
గాయి గందరగోళాల్లో గాడి తప్పుతున్న
గావరను నిభాయించి కదిలించాల్సిన అడుగు.
ఎదురు గాలిని తట్టుకొని చిరిగిపోకుండా
పట్టుకోవాల్సిన ఆశల గొడుగు.

485
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles