లాంగ్ స్టన్ హ్యూస్


Mon,September 17, 2018 12:08 AM

(1902, ఫిబ్రవరి 1-1967 మే 22)
langston_hughes-
కవిగా, సామాజిక కార్యకర్తగా, నవలా నాటక రచయితగా అమెరికన్ సాహిత్యానికి కొత్త పోకడలను అందించి నవాడు జేమ్స్ మెర్సర్ లాంగ్‌స్టన్ హ్యూస్! 1920 దశాబ్దంలో వచ్చిన జాజ్ కవిత్వోద్యమానికి (జాజ్ సంగీతపు లయతో, జాజ్ గీతకారులు, సంగీతాన్ని కవితా వస్తువులుగా చేసుకొని వచ్చిన కవిత్వం), న్యూయార్క్ నగరంలో మొదలైన హార్లెమ్ పునరుజ్జీవనోద్యమానికి (ఆలోచనా ధోరణుల్లో బౌద్ధిక, సామాజిక, కళాత్మక చేతనాన్ని కలిగించింది. నవ నీగ్రో ఉద్యమం అని మరో పేరు) దోహదం చేసిన తొలితరం మార్గదర్శి లాంగ్‌స్టన్! పుట్టుకతో నీగ్రోగా జన్మించి వర్ణ వివక్ష తాలూకు అన్ని దుఃఖాలనూ అనుభవించిన ఆయన, జీవించినంతకాలం సమానత్వం కోసం పరితపించి, దాన్నే తన సాహిత్యం నిండా పరిచిన ఆయన, The Weary Blues (1926)తో మొదలు పెట్టి Dear Lovely Death (1931), A New Song (1938), Fields of Wonder (1947) Montage of a Dream Deferred (1951), The panther and the lash (1967) వంటి ఎన్నో కావ్యాలను రాశారు. walt Whitman కవిత్వం చేత ప్రభావి తమైన ఆయన, అమె రికన్ సాహిత్యంలో నీగ్రోల అస్తిత్వ ప్రకటనకు వెర్రి గొంతుకనిచ్చి మ్రోసిన విశ్వనరుడు!.

493
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles