అనిశ్చితి


Mon,September 17, 2018 12:07 AM

Anischithi
కొన్ని సందేహాలను
మోస్తూ కదలాడే దేహం
ఏ సమూహంలోనూ
జవాబు దొరకదు
కొమ్మలపై
ఒంటరిగా కూర్చున్న పిట్టొకటి
లోలోపల ఏం గానం చేస్తుందో
ఎప్పటికి ప్రకృతి వినలేదు.
చీకటి పడిన తరువాత
ఆకాశం నక్షత్రాల మెరుపుతీగ
భూమికేదో సందేశాన్ని స్తుంది
ఇదెప్పుడు శ్రద్ధగా ఆలకించదు
కొండపక్కన పడున్న రాయి
శిల్పితో మౌన సంభాషణ చేస్తంది
వారిద్దరు ఏ సౌందర్య రహస్యాలను
పంచుకుంటారో ఎవరికి అర్థంకాదు
ఒక శలభం వద్దన్నా వినకుండా
దీప శిఖను పదేపదే ముద్దాడుతుంది
ఆ వెలుగు రహస్య ముద్దు చాలనం
వెలుగుకీ అంది చావదు
ఇంతకీ
ఎవరెరిని అర్థం చేసుకుంటారు
ఎప్పుడెలా రూపాతరం పొందుతారో
ఎప్పటికి పొంతన కుదరదు
ఈ ద్వైదీయ రహస్య భావజాలం
ఏకీకరణ కాజాలదు
- గరికపాటి మణీందర్
9948326270

630
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles