నేను ఎదుగుతున్నప్పుడు...!


Mon,September 17, 2018 12:07 AM

యుగాల క్రితం నాటి మాట ఇది
నా చిరకాల స్వప్నాన్ని నేను
దాదాపుగా మర్చిపోయిన కాలమది
కానీ అప్పట్లో ఆ స్వప్నం
నా కళ్ళముందు సాక్షాత్కరించింది
సూర్యునంత తేజోవంతంగా...
అప్పుడే ఎక్కడినుంచో ఓ గోడ మొలిచింది
నెమ్మదిగా ఎదిగింది
నాకు నా స్వప్నానికీ మధ్య నిలువుగా...
మెల్ల మెల్లగా పెరుగుతూ పోయింది
నా స్వప్నానికీ నాకూ మధ్య అడ్డంగా...
అలా పెరిగి పెరిగి.. ఆకాశాన్ని అందుకుంది!
ఇప్పుడిక నా మీదంతా నీడదే రాజ్యం
నా ముఖం నల్లబడిపోయింది
నా స్వప్నజ్యోతి ఎంతోకాలం నిలువలేదు
నా ముందూ... నా పైనా...
కేవలం మందపు గోడ మాత్రమే
కేవలం అంధకార ఛాయ మాత్రమే!
ఇప్పుడిక నాకు నా హస్తాలే శరణ్యం
చేతుల చేతలే నా ఆయుధం
అడ్డంగా ఎదిగిన గోడల్ని బద్దలు కొట్టడానికి
నా స్వప్నాన్ని నేను తిరిగి కనుక్కోడానికి...
ఈ గాఢాంధకారాన్ని ముక్కలు చేయడానికి!
నాతో సహకరించండి..
ఈ నిశీధి రాత్రిని అంతం చేయడానికి
ఈ గోడ నీడలని ఛిద్రం చేయడానికి...!
నాతో కలిసి రండి..
వేల కాంతుల సూర్యునిలోకి పయనించడానికి
సూర్యుని వేనవేల సుడుల
స్వప్నాన్ని ఆహ్వానించడానికి..!!
మూలం: లాంగ్ స్టన్ హ్యూస్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ
80080 05231

517
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles