బురదబొమ్మ కావాలి


Mon,September 10, 2018 01:01 AM

Ganapathi-papa
ఆమె కళ్ళల్లో ఒంటరి పక్షి వాలింది.
చేతుల కొసలు నిర్మాణ కూలీలు-
ఆమె ఊరిపి; బొమ్మ గుండెల్లో వరిగింది
రెండు నేత్రాలు అల్చిప్పల విచ్చుకున్నాయి..
మూడో నేత్రంలో కోపం వర్షించింది.
జనన మరణాలు ఒకే అడుగులో-
ఆమె కడుపు కోతకు గురైంది;
రక్తం బొట్లు బొట్లుగా ఉత్తరం వైపు..
అక్కడెవరో శిరస్సును కుట్టుతున్నారు.
ప్రాణం సుడిగాలై లేస్తే సరిపోతుందా?
వెన్నెలపాలను కుమ్మరించాలి కదా!
చెడుకో మంచికో; భక్తి బజారులో..
రంగులపాములు శరీరాలపై
కాలుష్య సంతకాలు చేస్తుంటాయి;
వాసన వాసన వాసనలో భక్తి తేలింది
పచ్చని రెక్కలు వెక్కి వెక్కి ఏడుస్తాయి..
అర చేతుల్లో బురద మరణించింది.
నింగి, నీరు, గాలి, భూమి,ఆకాశం
ఏదైతేనేమి ప్రాణాలను విడువాల్సిందే.
మనిషి ఊరేగుతున్నాడు మరి!
- అఖిలాశ, 072595 11956

656
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles