వీడ్కోలు!


Mon,September 10, 2018 12:58 AM

ఈ రోజు..
నువ్వు - నేను- మనిద్దరం
ప్రాచీన సంప్రదాయపు గడపను దాటేసి నడుద్దాం
నాకు మేలు జరగాలని ప్రార్థించకు
నాకు వీడ్కోలూ పలకకు
అదంతా ఓ తమాషా మాత్రమే!
మౌనమే మహోన్నత వ్యక్తీకరణ
వంచనకు తావులేని నిజ నిర్ధారణ
ఇప్పుడిక-
రాత్రి కోసం స్వప్నాలను వదిలేసినట్లుగా
సాగరం కోసం కన్నీళ్లను తర్పణం ఇచ్చినట్లుగా
చీకటి నదిలో గాలిని తరలించినట్లుగా
గతకాలపు ఆలోచనలను వదిలేయ్
రేపటి వెలుగుల భవిత కోసం..!
మూలం: గు చెంగ్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

471
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles