జెస్లా మిలోజ్


Sun,September 2, 2018 11:39 PM

(1911, జూన్ 30-2004 ఆగస్టు 14)
Czeslaw-Milosz
లిథువేనియాలో పుట్టి పెరిగి, చదువుకొ ని పోలిష్ భాషలో రచనలు చేసి, అమెరికాలో పౌరసత్వం పొందిన జెస్లా మిలోజ్ కవి మాత్రమే కాదు, రచయిత, అనువాదకుడు, దౌత్యవేత్త కూడా. స్టాలినిజంకు వ్యతిరేకంగా The Captive Mind (1953) అనే పుస్తకం రాసి సంచలనం సృష్టించిన ఆయన, ఆ తర్వాత పోలండ్ జాతి వ్యతిరేకిగా, క్యాథలిక్ మత వ్యతిరేకిగా కూడా విమర్శలకు గురయ్యాడు.
ఆయన రాసిన Three Winters (1936), Rescue (1945), The World (1945), A Treatise on Poetry (1957), City With out a Name (1969), Unattainable Earth (1984), Facing the River (1994), The Second Space (2002) వంటి కావ్యా లు ఆయనలోని తాత్విక సంఘర్షణలకు, నిర్మొహమాట ధోరణికి, నిరంతర సత్యాన్వేషణా స్ఫూర్తికి అద్దంపట్టి, కవి నిరంకుశుడు అన్న మాటని నిజం చేస్తాయి. ఆయన 1980లో ప్రతిష్ఠాత్మక నోబె ల్ సాహిత్య బహుమతిని గెల్చుకున్నారు.

ఆశ!

Aasha
నువ్వెన్నైనా చెప్పు
నీతోనే ఆశ ఉంటుంది
భూమి ఓ స్వప్న శకలం కాదు
సజీవ మాంసపు ముద్ద అని
నువ్వు నమ్మినంతవరకు!
ఆ చూపు.. స్పర్శ.. వినికిడి.. ఏవీ అబద్ధమాడవు కదా
అందుకే గేట్ ముందు నిలబడి
తోటలోకి చూసినట్లు చూడకు
అప్పుడు మాత్రమే నీ జీవితంలో
నువ్వెప్పుడూ కనీ వినీ ఎరగని విశేషాలన్నీ
అక్కడే నీకు సాక్షాత్కరిస్తాయి!
నిత్య నిరాశలను మోసుకుంటూ
నువ్వు యే తోటలోకీ ప్రవేశించలేవు
కానీ దాని ఉనికిని నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు
మనం మరింత స్పష్టంగా, బౌద్ధికంగా
ఈ నిజాన్ని చూడగలమా?
అలా అయితే..,
ఆ తోటలో ఏదో ఓ మూల
మన దృష్టిపడని ప్రదేశంలో
ఓ వింతైన కొత్త పుష్పాన్నో
ఓ అనామక నక్షత్రాన్నో
మనం కనుగొనగలం!
కొంత మంది అంటారు..
మన కళ్ళను మనం నమ్మొద్దని
మనం వెనుతిరిగిన మరుక్షణం
ఏ దొంగల ముఠా కబంధహస్తాలో
ఈ లోకాన్ని కబళిస్తాయని
మన తర్వాత ఈ ప్రపంచం ఇక మనలేదని..
అప్పుడు అక్కడ శూన్యం తప్ప మరేదీ కనిపించదు
వాళ్ళు లోకంపై ఆశను పోగొట్టుకున్నారు..!
మూలం: జెస్లా మిలోజ్
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

578
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles