ఛార్లెస్ బుకోవ్ స్కీ


Mon,August 20, 2018 01:30 AM

(1920, ఆగస్ట్ 16 -1994, మార్చి 9)
CHARLES-BUKOWSKY
కవి నిరంతరం ప్రజల పక్షమే! అందులోనూ పేద ప్రజలకు ఇరుదిక్కులా అక్షరాలతో రక్షణగా నిలబడేవాడు! అని నమ్మి, దాన్నే ఆచరించి జీవితానికి- సాహిత్యానికి అభేదతను పాటించిన జర్మన్-అమెరికన్ కవి హెన్రీ ఛార్లెస్ బుకోవ్ స్కీ. లాస్ ఏంజెల్స్ నగరం నుంచి ప్రచురించే పత్రిక Open Cityలో అమెరికన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల మీద ధిక్కార స్వరాన్ని వ్యాసాలుగా రాసి FBI పోలీసుల నిర్బంధాన్ని చవిచూశాడు. విప్లవ మేధావులతో అజ్ఞాత జీవితపు రారాజుగానూ, ప్రఖ్యాత TIME మ్యాగజైన్ వారిచేత అమెరికన్ అట్టడుగు , అణగారిన ప్రజల గొంతుకగా అభివర్ణించబడిన బుకో వ్ స్కీ, నిమ్నస్థాయి సామాన్యుల గుండెల్లో తన కవితల ద్వారా సుస్థిరస్థానం సాధించారు. సాధారణ ప్రజానీకం దుఃఖాన్నీ, అవసరాలనీ, ఆకాంక్షలనీ వ్యక్తం చేయడానికి కవిత్వాన్ని బలమైన సాధనంగా మలుచుకున్న ఆయన, చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని పత్రికలకు తన కవితలను రాసేవాడు. తన అక్షరాలూ, భావాలు విస్తృతం కావడానికి ఇది ఓ మార్గమని చెప్పే ఆయన, మొదట్లో పోస్టాఫీస్‌లో చిన్న ఉద్యోగం చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయి కవిగా మారి Flower, Fist, and Bestial Wail (1960), It Catches My Heart in Its Hands (1963), Crucifix in a Deathhand (1965), At Terror Street and Agony Way (1968), Fire Station (1970), Burning in Water, Drowning in Flame (1974), Maybe Tomorrow (1977), People Poems (1991) వంటి ఎన్నో కావ్యాలను రాశారు. మొత్తంగా ఆయన గళం అమెరికన్ నగర జీవిత సాగరంలో నిప్పులు పుట్టించింది! ఆయన కలం సామాన్యుల గుండెల్లోని అగ్ని జ్వాలలకు ఆర్ద్రతను అందించింది!

531
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles