నూరు వసంతాల మేడ!


Mon,August 20, 2018 01:28 AM

నిలకడగా
నిశ్చలంగా
నూరు సంవత్సరాలుగా
ఈ రాతిమేడ,
ఉద్యమాల ఉరుముల
మెరుపుల పిడుగుల నడుమ
అలా నిలుచునే వుంది
తరతరాల సాక్షిగా!
ఇపుడేమో
వెలిసిపోయిన రంగుతో
కాలపరీక్షలో
తరిగిపోయిన కాంతితో
కులతత్వరాజకీయాల
ముఠాల-వ్యక్తుల
నిలువెత్తు ఫ్లెక్సీలను భరిస్తున్న
ఆర్ట్స్ కాలేజి భవన ప్రాకారాలు,
సువిశా ప్రాంగణంలో
నిరాటంకంగా
నిర్వికారంగా
నేలకో నింగికి
ఎరుగుతున్న పావురాలు,
అనిశ్చిత అభద్ర భవిష్యత్తుతో
పుస్తకాలు మోస్తున్న విద్యార్థులను
పల్కరించి స్వేచ్ఛా పాఠాలు
నేర్పుతున్న జవజీవాలు!!
- నిఖిలేశ్వర్, 9177881201

458
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles