భయం గుప్పిట్లో కేరళ


Mon,August 20, 2018 01:28 AM

అక్కడో అలకబూనిన ఆమె
నిండుకుండలా తొణకకుండా వుంది
మరోచోట ఆమె గుండెలు పగిలి
దునుకుతున్న ప్రవాహం
కట్టలు తెంచుకుంటుంది
కన్నీటిసంద్రంలో లోకం
ఆమె మాత్రం ఏమీ ఎరుగనట్లు
అచ్చోటనే ప్రళయావతారం
భూతల స్వర్గంలో, నరకం సృష్టిలో
ఆమె పోరుతుంది అలుపెరుగక
భీతిల్లే జనవాహిని
ఆమె వానైతే.. భయం గుప్పిట్లో కేరళ..
- గిరిప్రసాద్ చెలమల్లు, 9493388201

245
Tags

More News

VIRAL NEWS