సహజమరణం!


Sun,August 12, 2018 11:34 PM

Sahaja-maranam
ప్రతినిత్యం దూషణ విస్పోటనాలతో
కంటినిండా నిద్రలేని కాళరాత్రి జీవితం
నెత్తురెరుగని గాయాలు రేపుతున్న నొప్పి
ఆశలు వదులుకున్నా బాధ్యతల్లో బందీ
మస్తిస్కాన్ని ఫోర్క్‌తో తోడెస్తున్న ఫీలింగ్
చదువుండి ఆలోచనలేని మూర్కత్వం
జ్ఞానాన్ని గాలికొదిలేసి అజ్ఞానపు ఆహాంకారం
వేదనలు నిండిన మానసిక సంఘర్షణతో
కన్నీరింకి పాలిపోయిన గాజుకళ్ళు
పగిలిన గుండెను ఫెవిక్విక్‌తో అంటించి
ముక్కలైన మనసును స్టిచ్చింగ్ చేసి
మరణాన్ని మురిపెంగా పెంచుకుంటున్న
ఆత్మవంచన తప్ప
ఆత్మత్యాగం చేసుకోలేని పిరికితనం
జీవంలేని శవమై నిత్యం చస్తూ బతుకుతున్న
ఆత్మ మరణించి అంతరాత్మ కుశించి
కుళ్లికంపుకొడుతున్న శరీరంతో జీవనం
నన్ను చిద్రంచేసి కుట్లేసి చాపలో చుట్టకండి
పంచనామాలు, పోస్టుమార్టాలు చేయకండి
ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకోలేదు
నాది సహజమరణమే!
- మధుకర్ వైద్యుల, 91827 77409

196
Tags

More News

VIRAL NEWS