దస్త్రం


Sun,August 12, 2018 11:33 PM

Dastram
ఎక్కడికి పోతావు
ఇన్నాళ్ళకు ఎదురుపడ్డావు
లెక్క చూసుకొందాము కూర్చో!
నన్ను ఎంత బర్బాద్ చేశావో
పైసా పైసా లెక్కలేసుకొందాము
కలం, దావాత్ తీసుకొని జర్రసేపు ఆగు!
దాటివేయడానికి ప్రయత్నించకు
దాక్కోవడానికి వేషాలు వేయకు
దస్త్రం పట్టుకొని అరుగుమీదికి రా!
మాటలు చెప్పకుండా
మాయలు చేయకుండా
ముందుగా ఖాతా పుస్తకం తెరువు
ఎన్ని మడతలు చెమట వాసన వేస్తున్నాయో
ఎన్నెన్ని కమ్మలు నెత్తురులో తడిశాయో
కూడికలు తీసివేతలు తేల్చి
హిసాబ్ చూపెట్టూ
నేను పెట్టిన తాకట్టుకు, ఈనాటి వెలకట్టు.
- ఆశారాజు, 93923 02245

296
Tags

More News

VIRAL NEWS

Featured Articles