పునరావృతం


Mon,August 6, 2018 01:33 AM

అత్యాచారాలు లేని దిన పత్రికను చూడాలని..!
GIRL
మహిళలు ఆకాశమంత
విస్తరించాలని..!
కలలుగన్న నా స్వప్నం
అడి ఆశల సుడిగుండంలో
అంతుచిక్కని వేదన.
అభివృద్ధిని అందిపుచ్చుకునే
అత్యాధునికత హింసకు
ఆజ్యం పోస్తుందా..!
వ్యాపార సంస్కృతిలో
స్త్రీ ఆటబొమ్మెనా..?!
ఎన్ని ఉరిశిక్షలు వేసినా
ఏమి ప్రయోజనం..
కాలం మారినా
కర్తవ్యాలు మారినా
కీచక పర్వాలు
మళ్ళీ మళ్ళీ పునరావృతం.. ...
- డాక్టర్ ఎం.దేవేంద్ర, 94906 82457

156
Tags

More News

VIRAL NEWS