వృద్ధాశ్రమం


Mon,August 6, 2018 01:31 AM

OLD-AGE
వృద్ధాశ్రమంలో ఓ మూల గది
గదిలో ఆ మూలన మంచం
మంచం పక్కన కిటికీ
కిటికీలోంచి చూస్తే..
గతంలో తెలిసిన ఆకాశమే
కాని ఇవాళది పూర్తిగా శూన్యం
అది దేనితో భర్తీ అవుతుందో తెలియదు..
అన్ని అవసరాలూ తీరుతున్నాయి
జీవితాన్ని పొడిగిస్తున్నట్టు.
జీవితమేనా ఇది!
శత్రువులెప్పుడూ లేరు
ఇప్పుడు ముసలితనమే ఓ దుష్మన్!
ఎవరిపైనా షికాయత్ లేదు
ఉంటే దేవునిపైన,
కాని అతడేదీ వినడు
ఆమె కిటికీలోంచి
బయటికి చూస్తూనే వుంటుంది..
ఒకప్పుడు
ఇట్లాంటి కిటికీలోంచే
ఆమె ఓ జీవశక్తిగా
లోపలికి వచ్చి వుంటుంది
బహుశా వెళ్లేటప్పుడు కూడా..
వృద్ధాశ్రమంలో
మంచాలు పాతవే
వచ్చిపొయ్యేవాళ్లే
మారుతుంటారు..!
- డాక్టర్ ఎన్.గోపి
(వృద్ధోపనిషత్ (old age poems) అముద్రిత కావ్యం నుంచి)

1056
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles