బ్లాగా డిమిట్రోవా


Mon,August 6, 2018 01:31 AM

-(1922, జనవరి 2 - 2003, మే 2)
స్లావిక్ భాషా శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన బ్లాగా నికొలోవా డిమిట్రోవా బల్గేరియా దేశపు ప్రముఖ కవయిత్రి, రాజనీతిజ్ఞురాలు, జర్నలిస్ట్, హక్కుల కార్యకర్త. 1970 దశకంలో నాటి బల్గేరియా ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొన్నప్పటికీ అణిచివేతకు వ్యతిరేకంగా కవితాగానాన్ని చేసిన ధీరురాలు.
Blaga-Dimitrova
Fire-flies fading, Questions, Because the Sea is Black, Scars, Forbidden Sea, The Last Rock Eagle వంటి ఎన్నో కావ్యాలను రాసి బల్గేరియన్ మేధోవర్గంలో సంచలనాన్ని, ఆలోచనలను రేకెత్తించారు. ప్రముఖ రచయిత జాన్ అప్ డైక్ రాసిన The Bulgarian Poetess అనే కథకు ఈమెనే స్ఫూర్తి. బల్గేరియాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం పతనమైన తర్వాత 1992లో ఆ దేశ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళ ఆమె. మొత్తంగా ఆమె కవనం- ప్రపంచ మహిళల హృదయ స్వరం! ఆమె గమనం- అంతర్ బహిర్ ప్రపంచ సంఘర్షణల భాస్వరం!!

532
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles