ప్రపంచ కవిత


Sun,July 29, 2018 11:26 PM

మహమూద్ దర్వీష్
(1942, మార్చి 13 - 2008, ఆగస్టు 9)
Mahmoud-Darwish
నిరంతర ధిక్కార స్వరానికి, నిత్య వివాదాల నాదానికి చిరునామా మహమూద్ దర్వీష్! 1948లో ఇజ్రాయెల్ ఆక్రమణ కన్నా ఆరేండ్ల ముందటి పాలస్థీనాలోని బార్వా పట్టణంలో జన్మించారు. తన కుటుంబంతో పాటు వలస వెళ్లి ఆ తర్వాత మాస్కోలో ఉన్నత విద్య చదివి ఆ తర్వాత ఈజిప్టు రాజధాని కైరోకు వెళ్లాడు. అతని రాజకీయ భావాల కారణంగానూ, ప్రజల్లో బహిరంగంగా తన కవిత్వాన్ని వినిపించినందుకుగానూ కొంతకాలం గృహనిర్బంధాన్ని, ఆ తర్వాత జైలు జీవితాన్ని కూడా గడిపాడు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆ తర్వాత అభిప్రాయ భేదాలతో దాన్నుంచి విడిపోయాడు. 26 ఏండ్ల ప్రవాసానంతరం 1996లో తన జన్మ స్థలానికి తిరిగి వెళ్లాడు. ఆ తర్వాత ఎన్నో పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన దర్వీష్ మొదటగా తన 19వ ఏట The Wingless Birds (1960)తో మొదలెట్టి The Music of Human Flesh (1980), Psalms (1995), Bed of the Stranger (1999), Mural (2000), The Adam of Two Edens (2001), Stage of Siege (2002) వంటి కావ్యాలను రాశారు. ఆయన కవిత్వం శరణార్థుల పొలికేక ! ఆయన జీవితం పాలస్తీనా ప్రజల పతాక!

565
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles