అభివాదం దాశరథీ!..


Mon,July 23, 2018 01:13 AM

vaddepalli-krishna
అన్నా ఓ దాశరథీ!
అభివాదం అందుకో!..
రత్నవీణ తెలంగాణ
రాజిల్లెను చూసుకో!.. ॥అ॥
నాటి రజాకార్ల మీద
కురిసిన నీ అగ్నిధార
తెలంగాణ రాష్ట్రమునే
తెచ్చెనుగా తనివిదీర! ॥అ॥
నీదు లలిత గీతాలు
స్వాదు సుధా పాతాలు!
మధుర సినీ గీతాలు
మంజుల సుమజాతాలు! ॥అ॥
ఏటేటా నా పేరును
ఎదను తలచె జనాళి!..
నిస్వార్థపు నీ సేవకు
అందింతుము నివాళి!... ॥అ॥
- డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 9246541699

224
Tags

More News

VIRAL NEWS