మనో స్వేచ్ఛ


Mon,July 23, 2018 01:13 AM

మన దేహం స్వతంత్రమై ఉండొచ్చు గాక ఇంకా మన మనసుకి మాత్రమే ఆ స్వేచ్ఛ లభించలేదుమనం బ్రిటిష్ పాలనా సంకెళ్ళను బద్దలు చేసాం చరిత్రను మార్చాము.. కాలాన్ని మార్చాముమనిషి స్వేచ్ఛాజీవి అయ్యాడు అయినా ఆధ్యాత్మిక గ్రంథాలూ ఇంకా దేవుని చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి మనం మన బలం తోనూ చెమటతోనూ శిశిరానికి వసంతాలు పూయించాం కోయిల స్వతంత్రమైంది ఐనా ఋతువులన్నీ ఇంకా వసంతానికి దాసోహమయ్యే ఉన్నాయి మన ఆదర్శమెమో ఆకాశం మధ్య నక్షత్రాలతో నగరాన్ని నిర్మిస్తుంది కానీ మన పూజలు మాత్రం ఇంకా ఆలయ గర్భ గుడిలోనే స్తంభించిపోయాయి ప్రతి ఒక్కరు అంటారు మనమంతా ఒక్కటే... మన దేశం ఒక్కటే అని అయినప్పటికీ విద్వేషమే మన ప్రస్తుత నినాదం మన ముక్తి ఒకే పతాకం కింద మనం ఒక్కటే.. మన లక్ష్యం ఒక్కటే మన గమనం ఒక్కటే అని అంటారు ఐనా ఎందుకిలా కొందరి పురోగమనం.. కొందరి తిరోగమనం కొందరి ఆరంభత్వం.. కొందరి గమనాంతం మనం ఢిల్లీ సింహాసనాన్న్ని పునరుద్ధరించాం కోటపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాం జెట్ వేగంతో మనం ముందుకే పరుగెడుతున్నాం ఐనా మతపు ఇనుప చువ్వల బోనులో మనం బందీలుగానే ఉన్నాం ఇంకా..
(ప్రముఖ హిందీ కవి, సాహితీ వేత్త, సినీ గీత రచయిత, పద్మభూషణ్ పురస్కారగ్రహీత గోపాల్ దాస్ నీరజ్ తన 94వ ఏట ఈ నెల 19న మరణించారు. ఆయనకు నివాళిగా..)
హిందీ మూలం: గోపాల్ దాస్ నీరజ్
స్వేచ్ఛానువాదం: అయినంపూడి శ్రీలక్మి

382
Tags

More News

VIRAL NEWS