హరిత మణిపూసలు


Sun,July 22, 2018 11:10 PM

త్యాగమే తరువు గుణం
తీర్చుకో దాని ఋణం
లేదంటే మనిషి బతుకు
అవుతుందిక దారుణం!!
అది కాదు ఒట్టి కొమ్మ
చేజాచిన ఓ అమ్మ
నరికే ముందుగ నీకు
కనపడదా తడి చెమ్మ!!
నీడ నిచ్చు చెట్టు తల్లి
నీ పాలిటి కల్పవల్లి
చేదోడుగ నిలిచావా
అదే కదా అమృత వల్లి!!
- వెన్నెల సత్యం
94400 32210

456
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles