దుఃఖభూమి


Sun,July 22, 2018 11:08 PM

నా మూలాలన్నీ దక్షిణాది జీవితంలోకే లోతుగా పెనవేసుకుని ఉన్నాయి.జాన్ బ్రౌన్, నాట్ టర్నర్, రాబర్ట్ లీల కన్నా గాఢంగా, లోతుగా.. నేను ఇక్కడే పుట్టి పెరగడం వల్ల ఉష్ణమండల ప్రపంచంలో ఇమిడిపోయే లా నేను అలవాటు చేయబడ్డాను.ఇక్కడి పామ్ చెట్టు, అరటి ఆకు, మామిడి, కొబ్బరి, రబ్బర్ చెట్లన్నిటికి నేను తెలుసు.వెచ్చని ఆకాశాలు, నీలి నీటి అఖాతాలు నా రక్తంలో కలిసిపోయి ఉన్నాయ్
తాజా పైన్ చెట్ల సువాసనతోనూ, చిన్నారి రక్కూన్ జంతువుల గుంపులతోనూ, విరగకాసి న అడవి ఉల్లిగడ్డ చేలతోనూ నాకూ గొప్ప అనుబంధం ఉంది.నీటి ఆవిరితో వేడిమిని పెంచే సౌకర్యం ఉన్న గృహాలలో నేనేమీ ఇంటిని వెచ్చబరిచే దీపాన్ని కాను. చెవులలో పాతాళ గృహాన్ని, సంగీతాన్నిసృష్టించుకుని లేను. ఆకాశంలోకి ప్రకృతిలోకి తొంగిచూడటానికి అవకాశం లేని ఉక్కు-చెక్క-ఇటుకలతో పేర్చిన గోడల మధ్య అంతకన్నా లేను.పత్తితోటలు, పొగాకు, చెరకు తోటలు నాకు కావాలి.. నేల మీద విత్తనాలను చల్లుతున్న సం చుల సాలు వెంట నేను నడవాలనుకుంటున్నా. నా మదిలో అవిశ్రాంత సంగీతాన్ని వింటూ నన్ను నేను కోల్పోయే ఆతురతలో ఉన్నా.ఓ నా దక్షిణాది దేశమా, నా దు:ఖ గృహమా, నా అస్థికలలోనూ, రక్తంలోనూ సుశ్రావ్య స్వరమేదో ధ్వనిస్తూ ఉంది. ఎన్ని అసూయాద్వేషాల సమూహాలూ, అల్లరి మూకలూ, చైన్ గ్యాంగ్ లు వచ్చినా నన్ను ఎంతకాలం నా జన్మభూమి నుండి దూరంగా ఉంచగలుగుతాయి?
మూలం:మార్గరెట్ వాకర్
స్వేచ్ఛానువాదం:మామిడి హరికృష్ణ, 8008005231

314
Tags

More News

VIRAL NEWS