మార్గరెట్ వాకర్


Sun,July 22, 2018 11:07 PM

-(1915, జూలై 7-1998, నవంబర్ 30)
Margaret_Walker
అమెరికా సాహిత్య చరిత్రలో 1942లోనే యంగ్ పోయెట్ అవార్డ్ పొందిన తొలి నల్లజాతి సృజనకారిణి మార్గరెట్ వాకర్. చికాగో నల్లజాతి పునరుజ్జీవన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆమె జాక్సన్ స్టేట్ యూనివర్సిటీలో మూడు దశాబ్దాల పాటు సాహిత్యం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె రాసిన For My People, Prophets for a New Day కవితా సం కలనాలు పీడిత తాడిత ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టాయి. వివక్షకు వ్యతిరేకంగా అక్షరోద్యమానికి ఆలంబనను ఇచ్చాయి. అమెరికా అంతర్యుద్ధ కాలంలో ఛిన్నాభిన్నమైన ఓ నల్లజాతి బానిస కుటుంబ గాథను జూబిలీ (1966) నవల పేరుతో 30 ఏండ్ల పాటు రాసింది. ఈ నవలే ఆ తర్వాత అలెక్స్ హేలీ రాసిన ఏడు తరాలు (Roots-1976) నవలకు ప్రేరణ అని చెపుతారు. తన కవిత్వాన్ని కేవలం ప్రచురణకే పరిమితం చేయకుండా మూడు ఆడియో ఆల్బమ్‌లుగా కూడా విడుదల చేసి నవ్య ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

443
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles