నేనొక ఎర్రని పూదోటనై
మండే ఎండల్లో.. ఆకుల ఆనవాలు లేకుండా
అడవైనా రహదారైనా.. ఆకాశంలో
చల్లని అగ్నిపూల దండలు వెదజల్లుతా..
ప్రకృతి నాకు వరమిచ్చి.. అలంకరించిన అరుణ వర్ణం..
అడవికి అందం రహదారికి రాజసం ...
కష్ట నష్టాల కాలాన్ని చూసిన..
ప్రపంచమంతా ఆనందంగా..
నాలా అందం ఆనందాల మేళవింపై
సాగాలని ఒక రహదారి పక్కనో...
ఉద్యానవనంలోనో బడి తోటలోనో ..
కార్ఖానాలోనో.. కార్యాలయంలోనూ...
మౌన మునినై నిల్చొని.. మానవ శ్రేయస్సు కోరుకుంటా...
- షబ్నం
(హరితహారంలో మూడేండ్ల కిందట పెట్టిన గుల్మొహర్
వృక్షమై ఎదిగిన ప్రేరణ నుంచి)