హాలికుల రాజ్యం


Mon,July 16, 2018 12:46 AM

FORMERts
తెలగాణ నేలతల్లి బిడ్డలార
కయ్యలను గండ్లును సరిచేసే హాలికులారా
కలసిరండి కదలిరండి మన నీటిని
ఒడిసిపట్ట తరలిరండి తె
నవ తెలగాణ సరిసంపదలు మీరై కదలండి
బంగారు తెలంగాణ మనదిగ చెయ్యండి
ఎడవాసిన ఎదలను ఏకం చేస్తూ
మిషన్ కాకతీయ మీ కోసం చూస్తుంది
నీల సంద్రమోలే పొంగిపొర్లు చెరువునీరు
ముందున్నది మంచికాలమని
ఎగసి ఎగసి పడుతుంది తె
తప్పుదారి పట్టించే తద్దినాలు మనకొద్దు
మన నేలతల్లి మనకిచ్చే
కొమరెల్లి ప్రసాదమై ముద్దు ముద్దు
రాజన్న కోడెదూడ రంకెలేస్తు
రైతన్న.. రా..రా.. అంటుంది. తె
జలసిరుల తెలగాణన
సేండ్లన్నీ సిరికుప్పలే
హాలికుల రాజ్యం తెలగాణ అయ్యిందిలే
- వాగుమూడి లక్ష్మీరాఘవరావు
9849448947

625
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles