భగీరథ ప్రయత్నం


Sun,July 8, 2018 10:55 PM

Man-made-miracle
నాలుగు చినుకులు పడితే
కాలమైందని కాస్తుజేసేటోళ్ళము
పుష్కరాల కోపారు చెరువు అలుగు దుంకితే
నీళ్ళను జూసి మురిసేటోళ్ళము
కానీ నేడు మా జాగల
పొంటి కాలువలు పోతున్నయి
కాళేశ్వరం ప్రాజెక్టుతో కళకళలాడుతదంటుండ్రి
మొన్న నేను రంగనాయక సాగర్ పోయినా
దారెంట కట్టతోనే కళ్ళకు కన్పించే
అక్కడున్న టన్నెల్‌లోకి తీసుకపోయిరి
అంతా చిత్రమే మాకు మయుడి
నిర్మాణమల్లె ఉండే
పది గజాల బాయి తవ్వితేనే కులుతది
వందల మీటర్ల లోతులో వంకలతో నిర్మాణాలు
మళ్లీ అందులో లోతైన బావిలా వుంచి
పంపులు బిగించుతుండ్రి
బాయికాడ ఒక హెచ్‌పీ మోటర్ నీటికి
తానమాడ తుళ్ళి తుళ్ళి పడుతము
ఆడ మోటర్లు అరువై హెచ్‌పీ స్పీడంట
చారించు నట్టు తింపడమే చెయ్యి తిరుగదు
చాంతాడంత బోల్ట్‌లతో బిగించవట్రి
నాలుగు పంపుల నిర్మాణ నైపుణ్యం
యాంత్రిక సొబగులకు తార్కనామై
ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టవట్రి
మూడు షిప్టుల పనులతో కార్మిక లోకం
కష్టాలను చూస్తే కన్నీరు ఒలుకుతుండే
వారి శ్రమ సౌందర్యమే అడుగడున అద్భుతాలు
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూశాకా
నాకైతే నమ్మకం కుదిరింది
గోదారి జలాలతో రైతన్న మడి నింపుతారని
మనం ఇల్లు కట్టాలంటేనే ఎల్లెలుకలా పడుతాము
మరి భూగర్భ రహదారి వేసి
జలాలను రప్పించే అపర భగీరథ ప్రయత్నం
విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.
- ఉండ్రాళ్ళ రాజేశం, 99669 46084

448
Tags

More News

VIRAL NEWS