చెరిగిన చిహ్నం


Sun,July 8, 2018 10:53 PM

cbs
గౌలిగూడ గుర్తు చెరిగిపోయింది
అలనాటి నీడ చెదిరిపోయింది,
నాగరికత పరుగులో బెదిరిపోయి
తనకు తానే కుప్పకూలిపోయింది!
ఎన్నెన్నో దూరాల నుంచి
దూసుకువచ్చే బస్సుల్లోంచి
దిగులుగానో, ఆనందంతోనో
భయంగానో, సంభ్రమంతోనో
అడుగులు వేసే పాదాలకు
భాగ్యనగర మహాద్వారం
స్వాగత తోరణమై నిలిచేది!
ప్రతి పనికి నజరానాగా
ప్రతి రోగికి చిరునామాగా
నిలిచిన మహానగరానికి
అక్కున చేర్చుకునే విశాల హృదయం!
వలస పక్షులను ఆదరించే మహావృక్షం
విగత జీవులను పలుకరించే మౌన చిహ్నం!
ఎన్నో వెతుకులాటలకు
ఆరంభం ఇక్కడి నుంచే,
ఎన్నెన్నో విజయాలకు
తొలి అడుగులు ఇక్కడి నుంచే!
జ్ఞాపకాల్లో చెరుగని దృశ్యం
చరిత్రలో నిలిచే అపురూప చిత్రం!
- పుట్టి గిరిధర్, 94914 93170

624
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles