ఆశాఢ బోనం


Sun,July 8, 2018 10:52 PM

Aashada-bonam
ఆకాశ దేశమిడిసి
ఆషాఢ మేఘమెక్కి
అమ్మలంతా పుట్టిళ్ళుజేరగా
అవనితల్లి పులకరించగా
పల్లె పల్లే మురిసె
పట్టణమూ మైమరిసె
చల్ల చల్లగ చినుకు
మెల్ల మెల్లగా కురిసె
గోల్కొండ ఎల్లమ్మ ఉజ్జయిని కాళమ్మ
నల్లపోచమ్మ కట్టమైసమ్మ
బోనాల నైవేద్యం కోరివచ్చిండ్రు
ఘటములన్నీ బారులుతీరి
పోతురాజులు నాట్యమాడి
మొక్కులన్నీ సమర్పించగ
ముగురమ్మల మూలపుటమ్మ
మనలగాచె చాలపెద్దమ్మ
వేడుకమీరగ వెలిగిపోవాలె
అంగరంగ వైభవంగా
భవిష్యవాణి వినిపించి
దీవెనలే ఇచ్చిపోవాలె!
- డేగల అనితా సూరి
92475 00819

562
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles