ఆకుపచ్చ కలలు!


Sun,July 1, 2018 11:34 PM

Maa-logo
నువ్వు వలస పాలకుల చెరలోఎడారివై గొంతు తడారిపోతున్నప్పుడు మా ఆశయాలు;కనిపించని సంకెళ్లలో తండ్లాడుతున్నప్పుడు కన్నీటి సంద్రాలమై
కడగండ్ల పాలవుతున్నప్పుడు నెర్రెలు వారిన గుండెతో నువ్వు అల్లాడటం యాది మరవగలమా?నీ విముక్తి కోసం ఉద్యమాలైనం సాంస్కృతిక సైన్యమైనం
అగ్ని గీతాలమై ప్రతిధ్వనించినం ఉపవాస దీక్షలైనం, పోరాటాలమై కదం తొక్కినం నెత్తుటి ఏరులమై ప్రవహించినం భగ భగ మండే మంటల్ని కావులించుకొని బూడిదైనం ఆ బూడిదలోంచే ఎగసిన మా ఆకాంక్షలు ఏడు కోట్ల పిడిక్ళ్ళై నినదిస్తున్నాయి ఇప్పుడు నీ ఒడిలో అసలు సిసలైన అమ్మపాలు తాగుతున్నాం
అజేయ శక్తులమై అవతరిస్తున్నాం మా ఉక్కు సంకల్పం ముందు ఎడారుల గుండెలు జలధులవుతాయి బీళ్ళూ, మోళ్ళూ చిగురించి రేపటి ఆకుపచ్చ కలలు కంటాయి ప్రకృతి, ప్రయోజనాత్మక కృతిగా ఆవిష్కరింపబడుతుంది సంభ్రమాశ్చర్యాల కాళేశ్వరం మహోధృతిలో కాలం నాటి కరువు కొట్టుకుపోతుంది జుట్టు పట్టుకొని యీడ్చుకొచ్చిన గంగ భగీరథుని పట్టుదల ముందు అలలు అలలుగా ఆశల కలలుగా ఉరవళ్ళు పరవళ్ళు గోదారి అవుతుంది వనరుల మాగాణమై సీతారామ
వరాల సిరులు కురిపిస్తుంది ఎండిపోయి బొక్కలు బయటపడ్డ నదులు ప్రాణధారలతో తొనికిసలాడుతూ జీవనదీ ధారలవుతాయి అమ్మా! తెలంగాణా!
జయ జయ ధ్వానాలతో నీ కీర్తి పతాకం హిమాల శిఖరాల మీద రెపరెపలాడుతుంది!
- డాక్టర్ దిలావర్, 98669 23294

242
Tags

More News

VIRAL NEWS

Featured Articles