తోడు


Mon,June 18, 2018 01:21 AM

Thodu-C
ఎందుకో ఏమీ తోస్తలేదు.. తెలుస్తలేదు..
నాకేమో కావాలి
లోనెక్కడో ఏదో తొలుస్తున్నది కాని
తెల్లగోలయితలేదు
ఊపిరి ఆడ్తలేదు
ఉక్కిరి బిక్కిరిగుంది
అంతా బిత్తర బిత్తరగుంది
చూపేమో ఆన్తలేదు
మబ్బు మబ్బుగుంది
చీకటి దుప్పటేదో కప్పినట్టుంది
అడుగు కదుపొస్త లేదు
తొవ్వ దొరుకుతలేదు
అంతా పొక్కిలి పొక్కిలి
పంటె తెల్లార్తలేదు
లేస్తే పొద్దూకుతలేదు
అంతా కలికలి.. ఎటమటం..
కాలాన్నేమో కాకెత్తుకుపోతున్నది
నాకేమో అయింది
మనసుల మనసు లేదు
కను రెప్పల్తోపాటు చేతులూ ఆడించా
మరో చెయ్యేదో తాకింది
అది ఆడో మగో పతా నహీ
ఫరఖ్ భీ నహీ
ఆఖిర్ అది మనిషిదే కదా...
- వారాల ఆనంద్, 94405 01281

518
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles