మట్టి ధర


Mon,June 18, 2018 01:20 AM

Matti-dhara
కాళ్ల కింద భూమి కదిలిపోయేప్పుడు
దాని గురుత్వాకర్షణ శక్తి కొలవడానికి
నువ్వు ప్రయత్నిస్తావు చూడు
అప్పుడు నీకు నువ్వు శక్తిహీనంగా కనిపిస్తావ్
కొంత మట్టిని చేతుల్లోకి తీసుకుని
ఓ బొమ్మ చేసి
దానికి పేరుపెట్టుకు తిరిగే పిచ్చివాడు
రైతని
మనిషని
పిలవబడతాడు..
మట్టినెవరో దొంగిలించారని
అక్కడ ఆందోళన
మనుషులు
భూమిని ఫెన్సింగ్ తీగల మధ్య
బంధించిన కాలం..!
భూమి ఇప్పుడు అమ్మబడే సరుకు
ఇటుకలు
ఇసుకతో పాటు
మనిషి రక్తం
మార్కెట్ సరుకు..!
- మెర్సీ మార్గరెట్, 90528 09952

438
Tags

More News

VIRAL NEWS