నేల పచ్చగుంటేనే...!


Mon,June 11, 2018 12:57 AM

Nela-pacchaguntene
ఈ ఏడాది
ప్రార్థన ఎవరు చేశారో
అడుగకుండానే
మేఘమొకటి కన్ను తెరిచింది!
రాత్రి కురిసిన వాన
నిప్పుల గుండాన్ని ఆర్పింది
ఒక్క వాన చినుకు ఎంత పని చేసింది
మట్టికి మనిషికి చెట్టుకు పిట్టకు
అర్థించకుండానే అన్నింటికి
ఒక భరోసా గీతాన్ని రాసిచ్చింది!
బంగారు స్వప్నానికిదో ముందు మాటలా ఉంది
నేల పచ్చగున్నంత వరకే
మన ఆటలు రక్తికట్టిస్తాయి!
(తొలకరి వానకు మురుస్తూ...)
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 94402 33261

271
Tags

More News

VIRAL NEWS