చిగురు పబ్బుల కల


Sun,June 3, 2018 10:48 PM

RIVER
నీరంత స్వచ్ఛగా
ఆటంకాలు చీల్చుకొని
వసంతాలు ప్రవహిస్తయి
నిప్పంత నిజంగా
వెలుగు కోనలు ప్రసరించి
బతుకులు పరిమళిస్తయి
ఆత్మకొమ్మలు
ఎంత తడి మెత్తనివి !
మధుధారల చెమ్మగిల్లి
దాహార్తినే స్పర్శిస్తయి
వనరుల చుట్టూ జణిగలు
అంటసొంపని తెలంగాణకు
ఎన్ని పాదులు నాటినయో!
అన్నీ కలియబడి చిగురించలేదా!
కునుకురాని కనురెప్పల మీద
చిల్లిపడ్డ నెత్తురు ముద్దనడుగు!
నేల పరిమళమద్దినందుకు
పక్కబొక్కలిరిచిన లాఠీల నడుగు!
నిలువెల్లా
పవిత్ర రక్తాన్నభిషిక్తించుకున్న
బారికేడ్ల కత్తులనడుగు!
చదువులతల్లివాకిళ్ళు మూగపోయి
పరిహాసించబడ్డమంటలనడుగు!
అడుగులు తెగుతున్నా
పాదముద్రల మీద
అంకురించిన కలం తమలపాకులివి.
ఈ కడప నిండా
ఫలవృక్షమై అల్లుకున్న తీగకు నమస్కరిద్దాం.
విధ్వంసానికి.. విస్మృతి ఒక భాగం
నిర్మాణానికి
మారుపురానిస్మృతి ఒక ఆలింగనం
ఆ చిగురుపబ్బుల కలలు నిజం చేద్దాం.
- బెల్లంకొండ సంపత్‌కుమార్ 9908519151

503
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles