అనంతం! మన ఆవిర్భావ ఆనందం!


Sun,June 3, 2018 10:48 PM

June--2
మన తెలంగాణ ధ్యాస లోకానికి
ధాన్యమైన రోజు!
మన యాసకు పదం పదంగా
పట్టాభిషేకమైన రోజు!
బలం బలగంగా మనం గెలిచిన రోజు
ప్రపంచానికి మనం తెలిసిన రోజు
దశాబ్దాల బంధాలను తెంచుకున్న రోజు
జూన్ 02 నిజంగా తెలంగాణ తల్లికి
తెల్లవారిన రోజు!
మన చరిత్రను మనం బంగారంగా
రాసుకున్న రోజు
ఎప్పటికీ అనంతం! మన ఆవిర్భావ ఆనందం
- కందాళై రాఘవాచార్య, 99086 12007

527
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles