విజయగీతిక


Sun,June 3, 2018 10:46 PM

పల్లవి: సంబరాలోయన్న సంబరాలు
తెలంగాణ ఆవిర్భావ సంబరాలో
సంబరాలోయన్న సంబరాలో
అంబరాన్నంటేటి సంబరాలు (2 సార్లు)
నడవర ఒరే నరసన్న
ఎగరర ఒరే ఎల్లన్న
దునుకర ఓరీ మల్లన్న
వెయ్యర నువ్వు దరువన్న !! సంబరాలోయన్న !!
చరణం: శ్రీ కాంతుల యాదన్నల
యాది చేసుకుందాము
జయశంకర్ సారుకూ
జేజేలు పలుకుదాము
పోరాటయోధులకు
పొర్లుదండం పెడదాము
అమరవీరుల అందరికీ (2సార్లు)
నివాళులు అర్పిద్దాం !! సంబరాలోయన్న!!
చరణం: సకల జనులమంతగలిసి
సమరమ్మును సాగిస్తీమీ
ఓటమంటు ఏరుగకుండా
స్వరాష్ర్టాన్ని సాధిస్తిమీ
ఎదురులేదు మనకింకా (2 సార్లు)
మోగిద్దాం విజయఢంకా !!సంబరాలోయన్న!!
చరణం: ఆటపాటలతోని
ధూంధాంలు. చేద్దాము
కొవ్వొత్తుల చేబూని
కొత్త వెలుగు నింపుదాం
మానవహారం తీసి
మనము ఒక్కటే అందాము
పట్టుబట్టి మనమంతా (2 సార్లు )
నిర్మిద్దాం
బంగారు తెలంగాణ మింక
సంబరాలోయ.
- కోడిగూటి తిరుపతి
95739 29493

436
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles