నీళ్ళు


Mon,May 28, 2018 01:57 AM

Neellu
అరె బాబూ..
చెంబులో నీళ్ళు అయిపోయినై
కొంచెం నింపి పోరా...!
సుపుత్రుడు
షాపింగ్ కెళ్ళే తొందరలో ఉన్నాడు
అతనికి వినపడలేదు..!
అమ్మాయీ..
గ్లాసు నీళ్ళు తెచ్చి పెట్టమ్మా..
కోడలికి వినపడింది గాని
వినపడక పోవటంతో సమానం..!
బంగరు నాన్నా..
కొన్ని నీళ్ళు ముంచుకరారా..
మనుమడు
టీవీలో పీకల్లోతు మునిగున్నాడు
అంగుళం కూడా కదల్లేదు..!
పనివాడి కోసం
కేకేశాడు గాని..
వాడు కూరగాయల కోసం
పరుగులు తీశాడు..!
కాస్సేపు
నిశ్శబ్దం రాజ్యమేలింది..
ఎవరు నింపారో తెలియదు గాని
అతని కళ్ళ నిండా నీళ్ళు..!
- డాక్టర్ ఎన్.గోపి
(వృద్ధోపనిషత్ (Old age poems)
అముద్రిత కావ్యం నుంచి..)

461
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles