రైతే రాజు


Mon,May 21, 2018 01:16 AM

Raite-raaju
ఎవుసాయమంటే ఇప్పుడిక్కడ
గాలిల దీపంబెట్టుడు గాదు!
ఇంటింటికీ దీపం ఎలిగించుకునుడే!
చిన్నప్పుడు-
గజ్జెల కాళ్ళ మీద పెట్టుకొని
పుస్తకాల్లల్ల అబ్బురంగ ఒంగొంగి చూసిన బొమ్మలు-
చెరువులు, కట్టలు, కుంటలు, పిల్ల కాల్వలు-
కట్ట పొంటి బార్లు కట్టిన గొర్లు, బర్లు,
చెట్ల మీది ఊర బిష్కలు, చెరువుల్ల కొంగలు
ఇప్పుడిక్కడ నిండుగ పానం బోసుకున్నయి!
అలుగులను దునుక్కుంటు మెండుగ బారుతున్న
చెరువులను జూస్తుంటే మొగులుక్కూడా మతి పోబట్టే !
ఇంటి సుక్కమ్మ సందమామసొంటి సద్ది మూటనిస్తే
భుజానిగ్గట్టుకొని ఉషారుగ కట్ట పంటి పోతున్న రైతుకు
ఎవుసాయం ఇప్పుడు ఎన్నిట్లో గోదారే కద!
ఎరువు కోసం చేన్లల్ల చెల్కల్ల మేకలు గొర్ల మందలను తోలే
కురుమ కనకయ్య-
బండిరుసును, బాడిశెను, నాగలి కర్రును
కణ కణ మండే కొలిమిల కదిలిచ్ఛే కమ్మరి భద్రయ్య-
నొగులును కాడిని ఒడుపుగ దుగూడ బట్టి
నాగలిని నాజూగ్గ మలిచే వడ్ల లక్ష్మయ్య-
కులవృత్తులుంటేనే గద ఊరికి కలిమి చెలిమి!
ఎవుసాయానికి బలిమి!
అందుకే-
ఇప్పుడిక్కడ ఎవుసాయం
బర్కత్ లేని బాంచన్ గిరి కాదు!
రైతులను సాయంతో సదుపాయంతో
ఆదుకునే అస్తిత్వ పతాక!
బతుకులను తీర్చిదిద్దే బంగరు తెలగాణం !
వివిధ ప్రాజెక్టుల రీడిజైనింగు
ఇక్కడి కర్షక కావ్యంలో పండిన కలల ఇంజినీరింగు!
దేశానికి రైతే వెన్నెముక అని-
రైతును రాజుగ జేసే మోజున్న
మనసున్న మారాజు ఇక్కడి బాద్ షా!
ప్రజల ఆకాంక్ష ల పూదోట కు
తన ఆశయాల హరివిల్లును జత చేస్తూ
అభివృద్ధి పథాన పయనింప జేస్తూ -
అతనిప్పుడు ఓ షహేన్ షా!
- డాక్టర్ వాణీదేవులపల్లి, 98669 62414

572
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles