అమావాస్య అక్షరం


Mon,May 21, 2018 01:15 AM

Amavasya-aksharam
విశ్వగీతం ఆఖరి అక్షరానికి
రంగులు దిద్దుతున్నాను
ఏ రంగు వేసినా నల్లరంగే వస్తుందేమిటి?
ఏ కుంచె వాడినా అస్తమయం
చిత్రీకరిస్తుందేమిటీ?
నేనిపుడు విశ్వమానవున్ని, ప్రపంచీకరణ
నన్ను విశ్వ విపణిలో వస్తువుగా నిలబెట్టింది
నేను ప్రాణమున్న వస్తువును
క్రయ విక్రయాల మధ్య
మనసును, ఆత్మను, శరీరాన్ని
బేరగాళ్లు లాక్కొన్న శ్రామికున్ని
ఎంత అందంగా చెపుతారు వీళ్లు
విశ్వం నాదని
ఏది నాది అనేది తెలియని
అమావాస్య వెలుగులో బ్రతుకుతున్నాను
అంతా వ్యాపారమయిన తర్వాత
ఏది నాది?, మాట నాది కాదు ఆట నాది కాదు
పాట నాది కాదు వేట నాది కాదు
ప్రశ్న ధిక్కరణ నావే కానీ
వాటికి ప్రాణం రావటం లేదు
ఈ గీతం నాదీ కానీ..
ఇంద్రధనస్సు అక్షరాలు చిత్రీకరించినా
కాగితమంతా నల్లగా అక్షరం కనిపించకుండా ఇదేమిటీ?
- సీహెచ్ మధు, 99494 86122

842
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles