బతుకులల్ల వెలుగులు..


Mon,May 14, 2018 12:48 AM

Brathukulalla-velugulu
నిప్పులు కురిసిన నేలపై
ఒక చల్లని చెలిమెకై
ఎన్నేల్లు ఎదురు చూసినయో
పాలమూరు పల్లెలు
ఏడ్చిన కొద్దీ కన్నీటి చారలే
ఎంత ఏడ్చిన నీటి ధారలు పారలే
కృష్ణమ్మ కూడా ఏడాదికి ఏడాది
కన్న బిడ్డల గోస చూసి
కన్నీటి శోకంతో కడలిని చేరేది
సగరులు అసమంజసులు
అంశుమంతులు అంతరించిపోయి
కాలగర్భంలో కలిసిపోతేనే
ఈ కన్నీళ్ళకు చరమగీతం..
కృష్ణమ్మ శివుని శిరస్సు పైకెక్క లేక
పాలమూరు పొలాలు తడుప లేక
వలస వోతున్న బిడ్డలనాపలేక
వలవల ఏడ్చిన రోజులు ఇక పోయినయి..
నేటి భగీరథుల దీక్షాదక్షతలు
కృష్ణమ్మ నీళ్ళను ఎదురెక్కించినయి
ఎత్తిపోతలై పంట పొలాలల్ల దుంకినయి
బీడు భూములు పచ్చని చేలైనయి
వసివాడిన రైతుల బతుకులల్ల జీవ ధారలైనయి,
వర్షం వెక్కిరించినా కాలం కాక పోయినా
మొగులు దిక్కు దిగులుగ చూసిన రోజులు పోయినయి ...
వలసల జిల్లాకు వరి కంకులు తరలి వస్తయి
చీకటి నిండిన బతుకులల్ల వెలుగులు మొలకెత్తుతున్నయి.
- ఎర్రోజు శ్రీనివాస్, 97003 02973

441
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles