రైతుకు భరోసా


Mon,May 14, 2018 12:47 AM

Raituku-bharosa
తెలంగాణ వ్యవసాయానికి నవోదయం
ఆరుగాలం కష్టపడే రైతాంగానికి శుభోదయం
రైతన్న గుండెల్లో కురిసిన తొలకరి జల్లు
భవిష్యదాకాశంలో విరిసిన ఆశల హరివిల్లు
కర్షకుల చెమట చుక్కల తడితో
పెరిగే పసిడి పంటలకు భరోసా
ప్రకృతి వైపరీత్యాల పడగనీడలో
సాగే సాగుకు కొండంత అండ రైతుబంధు
రైతుల కన్నీళ్ల వెనుక దాగిన విషాదగాథలు
తెలిసిన పాలకుడు కురిపించిన దీవెన
మత్తడి దుంకుతున్న చెరువుల గలగలలతో
పైరగాలిలో పచ్చని పైరుల రెపరెపలతో
రేపటి తెలంగాణ సాగు ఇకపై పండుగలా సాగు
రైతే రాజన్న నానుడి ఇక జీవం పోసుకుంటుంది.
- నోముల సంజీవరెడ్డి
99488 86550

446
Tags

More News

VIRAL NEWS