రైతు నవ్విండు


Mon,May 14, 2018 12:46 AM

Raitu-navvindu
తల్లి బాధ తల్లికే తెలుసు
నది గోస నదికే ఎరుక
భూమి బరువు భుమికే మాలిమి
మృగశిర కార్తిలో
ఆకాశమంతా కరువు
అప్పు పుట్టదు
పుట్టినా మోయలేని మిత్తి
ఓ కన్ను అప్పుకోసం
ఓ కన్ను వానకోసం
రైతుల ఎదురుచూపులు
ఏసిన విత్తనం మొలువదు
మొలిసిన మొక్క పూతవట్టదు
రైతే రాజంటూ
కట్టలు తెగే సానుభూతిలో
తడిసి ఎండిన రైతులు
మెరిసినోళ్ళు మెరిసినట్లే
మురిపిచ్చి పొద్దుగడుపుకున్నరు
ఒక్కని చెయ్యన్న
అన్నదాత గుండెను నిమురలే
రోహిణికార్తి ముందే
రైతులకు గుండె తడి
పెట్టుబడికి ఆసరా
రైతులకు భరోసా
భుజం తట్టిన ఆత్మస్థైర్యం
అదునుకు ముందే
రైతు నవ్విండు
బంగారు తెలంగాణకు
బాటలేసిండు
- వనపట్ల సుబ్బయ్య
94827 65358

452
Tags

More News

VIRAL NEWS

Featured Articles