కందీల్ బుగ్గ


Mon,May 14, 2018 12:46 AM

kandil-bugga
సాయంకాలం
జారిన తెరలా చీకటి పడింది
పసిపిల్ల పాలకోసం ఏడుస్తుంటే
ఆడుకొంటున్న పిల్లాడిని
ప్రేమగా తల్లి పిలిచింది
మూలకున్న గూట్లోని
గాజుబుగ్గను తుడిచి
కందీల్ ముట్టించమంది
అడుగుల సవ్వడిలేక
గొణిగిన చప్పుడు రాక
బయటకు వచ్చి సంబరం పడింది
వెలిగించని కందీల్ కిందనే వుంది
కొడుకు చెట్టమీదికెక్కి
కొమ్మకు చందమామను
వేళాడదీస్తున్నాడు
చీకట్లను తరిమిన బిడ్డను చూసి
తృప్తిగా నవ్వుకొంది
వెన్నెలా ఆమె ముఖమూ
రెండు రంగులా కలిసిపోయీ
కందీల్ బుగ్గ కన్నా
తెల్లగా వెల్తురొచ్చింది
- ఆశారాజు
93923 02245

432
Tags

More News

VIRAL NEWS