అమ్మ


Mon,May 7, 2018 01:09 AM

Amma
నిర్వచనాలకు అందని పదం
విశ్లేషణలకు లొంగని విశేషం
ఎంత వర్ణించినా తరగని గని
ఎన్నటికీ తీర్చుకోలేని ఋణం
అమ్మ
ఎంత మధురమైనదీ
రెండక్షరాల మాట
వినోదంలోనూ విషాదంలోనూ
అలసటలోనూ
ఆనందంలోనూ
అప్రయత్నంగా ఉబికివచ్చే
సహజాభివ్యక్తి
అమ్మ
ప్రేమకు పర్యాయపదం
ఆత్మీయతకు అక్షరాకృతి
మమతల మల్లెచెట్టు
దిగులుకు దివ్యౌషధం
అమ్మ
అ అంటే అమ్మ
ఆ అంటే ఆప్యాయత అంటూ
చిన్నప్పుడు వర్ణమాల నేర్పిన
చెట్టు కింది పంతులును స్మరిస్తున్నా
అమ్మను గౌరవించే సంస్కారాన్నిచ్చిన
గురువులకు నమస్కరిస్తున్నా
వేగానికి పర్యాయపదంగా
మారిన యాంత్రిక జీవితంలో
ఏడాదికి ఒక్కసారే అమ్మను
గుర్తుచేసుకునే
సన్నివేశం పట్ల సిగ్గుపడుతున్నా
- ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, 96180 32390
(మే 13, అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా...)

885
Tags

More News

VIRAL NEWS

Featured Articles