అలల తళతళలు


Mon,May 7, 2018 01:08 AM

Alala-thalathalalu
ఎండిన మట్టిని తాకితే పంట
చౌడు నేలను ముట్టుకుంటే పసిడి
శ్మశాన భూమిని సశ్య శ్యామలం చేసిందెవరు ?
పూలు విచ్చుకున్న జలంతో
ఏవీ సరితూగవు
జూలు విదిల్చిన నీటితో
ఏవీ సరిరావు
మందగమనలూ హంసనడకలూ
ఏవీ పోటీపడవు
నీళ్ళే ఒక నడుస్తున్న అద్భుత ఆకర్షణ !
పంట భూములు పాలిండ్లు
పెళ్లి మంటపాలున్నట్లు ప్రాజెక్టులు
నిండు చూలాలు ఈ నేల
భూపాలకుడు పానీయం!
సువిశాల ఆకాశంలో నక్షత్రాలు మెరిసినట్లు
ఏపుగా చెట్టుకు కాయలు కాసినట్లు
నిండిన ఆకాశంచెరువులో అలలు విరబూసినయ్
లంఘించి పరుగెత్తుతున్న పులి కన్నా
పలు రెట్లెక్కువ జింక పరుగు
నది జింక
ఉప్పుసముద్రంలో కలిస్తే
విలువ వలువలు ఒలిసినట్లేనని
అంతే పరుగుతో వెనుదిరిగింది నది
ఘనప సముద్రంలో
అలల తళతళలతో మురుస్తుంది
- కందుకూరి శ్రీరాములు, 94401 19245

389
Tags

More News

VIRAL NEWS

Featured Articles