లూషీ నుంచి సోఫియా దాకా!


Mon,May 7, 2018 01:08 AM

Lucy-nunchi
ప్రయాణం గొప్పగా వుంది
మనిషి కేంద్రంగా
మట్టినీ దిగంతాన్ని
కళ్లకద్దుకుని
మనిషి చేస్తున్న ప్రయాణం
చాలా గొప్పగా వుంది
ఎన్ని చీకట్లు
ఎన్ని సిగ పట్లు
ఎన్ని యుద్ధాలు
ఎన్ని నరమేధాలు
ఒలికిన విషపు పాత్రలెన్ని
తగలబెట్టిన దేహాలెన్ని
విరిగిపడిన భావ సంకెళ్లెన్ని
కూలిన ఛాందసాల
కోట గోడలెన్ని
ఇంకా కూల్చాల్సిన
లోపలి పొరలెన్ని
చించి వేయాల్సిన ముసుగులు
తొలగించాల్సిన ముళ్ల కంచెలు
తెరవాల్సిన చీకటి గుహ్యారాలు
అల్లుకోవాల్సిన వెలుగు కిరణాలు
మనందరి మూలాల్ని
పరిచయం చేసిన
చీకటి ఖండాంతర
వెలుగు దారి లూషీ
మానవ ప్రేమకు వేసిన
చెక్కు చెదరని పునాది
రోబోలవుతున్న మనుషులకు
మనుషులవుతున్న రోబోల
మానవవాద మంత్రం
సోఫియా ఏదో
చెవిలో ఊదుతోంది
మనిషిని మనిషితో
మహత్తరంగా కలిపివుంచే
మర ఏదో కొత్తగా
బిగిస్తోంది
మనందరి సృష్టికర్త
మనిషేనని
లూషీ నీడలోంచి
నడిచొచ్చిన సోఫియా
మనతో సరికొత్తగా
సంభాషిస్తోంది
మనల్ని మనకు
పరిచయం చేస్తూ
మనిషిగా గొంతెత్తుతోంది
మానవ సాధికారతను
దిగంతాల అంచుల్లో
దిక్కులు పిక్కటిల్లేలా
నినదిస్తోంది!
- చిత్తలూరి, 82474 32521

366
Tags

More News

VIRAL NEWS